నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగు పడటంతో ఒక కొబ్బరి చెట్టు కాలిపోయింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై దట్టమైన ఈదురుగాలులతో పిడుగులతో వర్షం పడింది. ఇదే సమయంలో పెద్ద శబ్దం తో పిడుగులు పడ్డంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. జనావాసాలకు సమీపాన ఉన్న ఒక కొబ్బరి చెట్టు పై పిడుగు పడటంతో కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఎవరికి ఏమి కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.