నర్సీపట్నం మున్సిపాలిటీ మూడో వార్డులో ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు శుక్రవారం ఉదయం రెండున్నర గంటల ప్రాంతంలో అత్యాచారం చేసాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ చిన్నారి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇంట్లో నిద్రపోతున్న చిన్నారి పక్కనే నివసిస్తున్న ఒక యువకుడు సమీప ప్రాంతంలో కి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఎస్పి తెలిపారు. చిన్నారి అక్క చెల్లిని ఎవరు అపహరించుకు పోయాడని కేకలు వేయడంతో తల్లిదండ్రులు మేలుకొని వెతకగా సమీపంలో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చిన్నారి కనిపించింది. తల్లిదండ్రులు వెంటనే పాపను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళి చేర్పించారు. నర్సీపట్నం ఏఎస్పీ మనికంట చందోలు ఏరియా ఆసుపత్రికి వచ్చి చిన్నారి చూసి పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించామన్నారు. తల్లిదండ్రులు ధగ్గర ఫోన్ లేకపోవడంతో సమాచారం ఆలస్యంగా తెలిసిందన్నారు.