మహిళా భద్రత కోసం సీఎం వైయస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని, దిశ చట్టం, యాప్, జీరో ఎఫ్‌ఆర్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. నిజానికి చంద్రబాబు పాలనలోనే మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ అని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో గత చంద్రబాబు పాలనకు, ప్రస్తుత సీఎం వైయస్ జగన్ పాలనకు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మహిళ భద్రత, సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం సీఎం వైయస్ జగన్ ఎలాంటి పాలన అందిస్తున్నారనేది గడిచిన మూడేళ్లుగా ప్రజలకు స్పష్టం కనిపిస్తుందన్నారు. సచివాలయంలో మంత్రి తానేటి వనిత విలేకరుల సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వంలో చివరి మూడేళ్లలో రేప్, హత్యలు 34 జరిగితే.. ప్రస్తుతం 33 జరిగాయని, గత ప్రభుత్వంలో గ్యాంగ్ రేప్‌లు 71 జరిగితే.. ఇప్పుడు 69 నమోదయ్యాయని, మహిళా హత్యలు అప్పుడు 79 జరిగితే.. ఈ మూడేళ్లలో 68 జరిగాయని, చంద్రబాబు పాలన చివరి మూడేళ్లలో వరకట్న వేధింపులతో 456 మంది మహిళలు చనిపోతే.. ఈ మూడేళ్లలో ఆ సంఖ్య 358కి తగ్గిందని, వరకట్న హత్యలు బాబు పాలనలో 28 జరిగితే.. ఇప్పుడు 14కు తగ్గాయని హోంమంత్రి వివరించారు.
కానీ యావత్ ప్రజానీకం తెలుసుకోవలసిన విషయం ఒకటే, చంద్రబాబు సరిగ్గా పరిపాలన అందించలేదు, మేము అందిస్తాము అని చెప్పేగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళి చంద్రబాబుతో పోల్చుకుంటూ ప్రజలను మోసం చెయ్యడం సబబేనా... పోలిక ఎందుకు... మీరు చేస్తాను అన్నారు కధ చెయ్యాలి కదా ...? ఈసారైనా అలోచించి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోండి అని మనవి.