మీరు చికెన్ ప్రియులా? మీరు రకరకాల వంటలను వండుకుని రుచి చూశారా? మీరు చాలా వెరైటీగా రుచి చూశారా? అర్థం కాలేదా? నా ఉద్దేశ్యం మీరు ఎప్పుడైనా దాల్ చికెన్ రుచి చూశారా? ఈ సారి మీరు చికెన్ కొన్నప్పుడు, దానితో చికెన్ దాల్ తయారు చేసి రుచి చూడండి. ఈ చికెన్ దాల్ చపాతీ, పుల్కా, రైస్ మొదలైన వాటితో పాటు తింటే అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు, దీన్ని తయారుచేయడం కూడా సులభం.
అవసరమైనవి:
* చికెన్ - 250 గ్రా
* పచ్చిమిర్చి - 2 (పొడవుగా తరిగినవి)
* కరివేపాకు - కొద్దిగా
* టమోటో - 1 (తరిగినది)
* పసుపు పొడి - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచికి సరిపడా
* పప్పు - 1/2 కప్పు
* నీరు - 2-3 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర - కొద్దిగా
పోపుకి ...
* నెయ్యి - 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
రెసిపీ:
* ముందుగా పప్పుని బాగా కడిగి నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టాలి.
* తర్వాత ఒక గిన్నెలో చికెన్ కడగాలి.
* తర్వాత స్టౌ మీద ఒక పాన్ పెట్టి అందులో పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, ఉప్పు, పసుపు, వేసి వేగించి ఆ తర్వాత అందులో కడిగి నానబెట్టుకున్న నీళ్లు పోసి మరిగించాలి.
* నీరు బాగా ఉడకడం ప్రారంభించిన తర్వాత, మంటను కనిష్టంగా తగ్గించి 25 నిమిషాలు ఉడకబెట్టండి.
* తర్వాత అందులో కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మళ్లీ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించాలి.
* తర్వాత స్టౌ మీద చిన్న ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నెయ్యి పోసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
* తర్వాత తరిగిన కొత్తిమీర వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ దాల్ వేసి మొత్తం మిశ్రం కలపాలు. అంతే దాల్ చికెన్ రెడీ.