ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమా పురం శివారులో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువలో స్ధానికులు మృతదేహన్ని గుర్తించారు. కాలువ పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం ఆధారంగా గంధం శివ (23)అనే వ్యక్తి గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బందువుల కథనం ప్రకారం గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉపాధి హామీ పథకం పనికి వెళ్లాడు. అక్కడ నుంచి మొక్కజొన్న ఫ్యాక్టరీపనికి వెల్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే రాత్రి 9:00 అయినా సరే ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా శుక్రవార ఉదయం 10 గంటల సమయంలో ఫాతిమా పురం శివారులో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ దగ్గర శివ మృతదేహాన్ని స్తానికులు గుర్తించారు. అయితే శివ మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు.