వేసవిలో లభించే మంచి పండ్లలో పుచ్చకాయ ఒకటి.ఈ పండు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. తాజా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది.పుచ్చకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి ఫలితంగా, పుచ్చకాయ ద్వారా శరీరంలో చక్కెర పరిమాణం నియంత్రించబడుతుంది. డైటింగ్ చేసే వారికి కూడా పుచ్చకాయ అనువైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు.అయితే వేడి వాతావరణంలో రిఫ్రిజిరేటర్లో ఉంచిన పుచ్చకాయ ముక్కను తింటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. కానీ, పూర్తి పోషకాహారం అందాలంటే మాత్రం చల్లటి పుచ్చకాయ తినడం బంద్ చేయాలి.పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు చల్లని పుచ్చకాయ తినవలసి వస్తే, మీరు పుచ్చకాయ స్మూతీ లేదా మిల్క్ షేక్ చేసి తీసుకోవచ్చు.