ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని మరో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు చుట్టుపక్కల వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాలికకు అధికంగా రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు. బాలిక చికిత్స పొందుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడి గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాచారం కేసు నమోదు చేస్తున్నామని, ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు.