పల్నాడు జిల్లా, పరిధిలో పోలీస్ వారు నాటు సారా స్థావరంపై దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా బెల్లంకొండ, మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాటుసారా విక్రయిస్తున్న వారిపై రైడ్ నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నాటుసారా బాటిళ్లను సీజ్ చేశారు. అలానే నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసనాబాద్ తండా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్న ప్రదేశంపై రైడ్ జరిపి 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.