ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అందరూ కలిసిరావాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తమ లక్ష్యమని, దీనిపై పార్టీ అధినేత స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. టీడీపీతో పొత్తును పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.