అనకాపల్లి జిల్లా చిన్నారి, సత్యసాయి జిల్లా తేజశ్విని ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యాచార బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.