ఐపీఎల్-2022లో వరుస విజయాలతో గుజరాత్ దూసుకుపోతోంది. మరో వైపు వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై జట్టు.. పటిష్ట గుజరాత్‌ను శుక్రవారం ఢీకొట్టనుంది. ఈ తరుణంలో ఈ రెండు జట్ల మధ్య కాసేపటిలో ఆసక్తికరపోరు జరగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలోనూ మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల ఆటగాళ్లు ఉన్నారు. గుజరాత్ జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ ముంబై జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. అయితే వరుసగా ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత గత మ్యాచ్‌లో ముంబై జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ ఉత్సాహంలో గుజరాత్‌ను సైతం ఓడించి, సత్తా చాటాలని భావిస్తోంది.
గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ
ముంబై ఇండియన్స్ (తుది జట్టు): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్