వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ నెల 11న మత్స్యకార భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. చేపల సంరక్షణ కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఏటా ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద రూ.10వేలు అకౌంట్లో వేస్తోంది. దీనితో పాటు అదనంగా డీజిల్ సబ్సిడీని ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తోంది.