చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తే, పవన్ ప్యాకేజీ కోసం ఆరాటపడతారని మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. వారేమీ కొత్త ప్రత్యామ్నాయం కాదని, కలిసే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు, సొంతపుత్రుడు, దత్తపుత్రుడు అందరూ కలిసొచ్చినా ఏమీ చేయలేరన్నారు. ‘సింహం సింగిల్గానే వస్తుంది. సిఎం జగన్ ఒక్కడే. వైసీపీ ఒకవైపు, మిగిలిన పార్టీలన్నీ మరోవైపు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేదే లేదన్నారు.