వ్యవసాయ శాఖపై సమీక్షించిన సీఎం జగన్.. జూన్లో రైతులకు 3వేల ట్రాక్టర్లు పంపిణీ చేస్తామన్నారు. ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ సెంటర్లలో సాగు పనిముట్లు పంపిణీ చేస్తామన్న సీఎం జగన్ .. శ్రీకాకుళంలో సాగు బోర్లకు మీటర్ల పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, దీని ద్వారా 30% విద్యుత్ ఆదా అవుతుందన్నారు. మీటర్ల వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతోందన్న జగన్.. త్వరలో ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామన్నారు.