మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆయుబాన్(32) కడుపునొప్పి తాళలేక మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకుని సేవించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.