శ్రీ సత్య సాయి జిల్లాలో ఈ నెల 27న జరుగు మాదిగల చైతన్య సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం స్థానిక సాయి ఆరామంలో విలేకరులతో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ 11 న జరగాల్సిన మాదిగలచైతన్య సదస్సు 27 న నిర్వహించనున్నామని, ప్రధానంగా ఎస్సీ ఎస్టీల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయలని, గ్రామాలలో స్మశాన వాటికకు భూములు కేటాయించాలనే డిమాండ్లతో చైతన్య సదస్సు నిర్వహిస్తున్నామని ఆ సంఘ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు లు కుంటిమద్ది ఓబులేసు, రంగనాథ్, గంగి శెట్టి, తిప్పయ్యతదితరులు పాల్గొన్నారు.