ఓ ఎస్సై ప్రేమలో పడిన ఓ యువతి బంగారు కలలు ఊహించుకుంది ఐతే ప్రేమాయణం నడిపిన ఆ ఎస్సై మరో యువతితో ప్రేమయం నడుపుతున్నాడని తెలిసి జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం జిఏ కొట్టాలలో చోటుచేసు కుంది.
గత మూడు రోజుల క్రితం క్రిమిసంహారక మందు సేవించిన యువతిని తల్లి దండ్రు లు అనంతపురం ఆసుపత్రికి తరలిం చారు. పరిస్థితి విషమించడంతో ఆత్మహత్య యత్నానికి అసలు కారణం ఎస్సై విజయ్ కుమార్ అని తన ప్రేమ వ్యవ హారం తల్లిదండ్రులకు చెప్పి కన్ను మూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. పామిడి మండలంలోని జిఏ కొట్టాలకు చెందిన భీమ్లా నాయక్ , లాలెమ్మ దంపతుల కుమారుడు విజయ్ కుమార్ నాయక్ చిత్తూరు జిల్లా చంద్రగిరి లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన పద్మావతి తిరుపతి యూనివర్సిటీ లో డిగ్రీ చదువు తోంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఐతే ఆ ఎస్సై మరో యువతితో కూడా ఏకకాలంలో ప్రేమాయణం నడిపాడు.
ఆ ఎస్సై వ్యవహారం ఇద్దరు యువతులకు తెలియడంతో న్యాయం కోసం మరో యువతి దిశా పోలీసులను ఆశ్రయిం చింది. దీంతో ఎస్సై విజయ్ కుమార్ నాయక్ ఆ యువతిని పెళ్లి చేసుకున్నా డని మృతురాలు సరస్వతి సోదరుడు తెలిపాడు. ఈ విషయం తెలిసి తన సోదరి మనస్తాపానికి గురైందన్నారు.
ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం సరస్వతి తిరుపతి నుంచి సొంతూరుకు వచ్చింది. దేవర పూజా కార్యక్రమం ఉండ డంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పంపనూరు తండా కు వెళ్లారు.
దీంతో ఇంట్లో ఉన్న సరస్వతి బుధవారం తెల్లవారుజామున విష రసాయనం తాగింది. ఆ విషయాన్ని తమ వద్ద చెప్ప కుండా దాచిపెట్టిందని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో పామిడి ఆసుపత్రి లో చికిత్స చేయించా మని తల్లిదండ్రులు తెలిపారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించిందని కన్నీరు పెట్టుకున్నారు.
ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తన కూతురును ప్రేమతో మోసాగించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. తన కూతురు చావుకు కారణమైన ఎస్సై పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించా లని శుక్రవారం రాత్రి పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు తాడిపత్రి డిఎస్పి చైతన్య బాధిత కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు స్వీకరించారు. దీంతో చంద్రగిరి పోలీసులు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.