అవుకు మండలంలోని గడ్డమాకులపల్లి గ్రామ శివారులో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. అవుకు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో 1800 లీటర్ల బెల్లపు ఊటను నేలపాలు చేశారు. అలాగే సారా తయారీకి వినియోగించే సామాగ్రిని ధ్వంసం చేశారు. అదేవిధంగా 60 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.