ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు. ఇంట్లో వారి ప్రేమ విషయం చెబితే కాదనడంతో పరారయ్యారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఇంద్రపురి వద్ద చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెందిన తనిష్క్ శ్రీ(19), దానాపూర్ కి చెందిన శ్రేయా ఘోష్(22) ఐదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా స్నేహితులయ్యారు. వారి ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలనుకున్నారు. పెళ్లి గురించి ఇద్దరు అమ్మాయిలు తమ ఇళ్లల్లో చెప్పడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి ఏప్రిల్ 26న ఢిల్లీకి చేరుకున్నారు.
అయితే తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ తనిష్క్ శ్రీ కుటుంబసభ్యులు శ్రేయాఘోష్పై కిడ్నాప్ కేసు పెట్టారు. ప్రేమ జంట ఈవిషయం తెలిసి పాట్నాలోని మహిళా పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని, తమను విడదీసే హక్కు ఎవరికీ లేదని ప్రేమజంట పోలీసుల చెంత విన్నవించుకున్నారు. పోలీసులు వారికి తగిన న్యాయం చేస్తామని తెలియజేశారు.