ఎండల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు వెళ్లింది. తీవ్ర ఎండల వల్ల ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయేమోనని చాలా మంది అనుకున్న తరుణంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. మామూలుగా కంటే ఈసారి ముందే రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లు అయ్యింది.
మే నెలలో 20వ తేది తర్వాత ఎప్పుడైనా కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు మొదలవుతాయి. కానీ ఈసారి ముందే రానున్నట్లు ఐఎండీ తెలిపింది. పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో తన తాజా ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ ద్వారా రుతుపవనాల రాకను ఐఎండీ అంచనా వేసినట్లు తెలిపింది.