ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రాజ్యసభ్య సభ్యుడు, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కిరాయి మూకలతో టీడీపీ వారే ఇలాంటి పనులు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో శనివారం నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలలో నిందితులుగా టీడీపీ వారు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు గెలుస్తామనే నమ్మకం లేక ఇటువంటి పనులకు పాల్పడుతున్నాడని అన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాడని పేర్కొన్నారు. టీడీపీ వారు చేస్తున్న అఘాయిత్యాలను ప్రభుత్వంపై బురద జల్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు.
ఏపీలో మరో 25 సంవత్సరాల పాటు వైసీపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విజయసాయి రెడ్డి చెప్పారు. తాము వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి దిగుతామన్నారు. ప్రస్తుతం సాధించిన ఎమ్మెల్యేల కంటే వచ్చే ఎన్నికల్లో స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదని, ఒంటరిగా గెలవలేని వారే పొత్తుల కోసం ఆరాటపడుతున్నారన్నారు.