ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం దిశ పేరుతో ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసారు. ఇప్పటికే లక్షలాది మంది మహిళలు తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.ఈ యాప్‌పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో దిశ యాప్ ద్వారా సీఎం జగన్ దేశానికే దిశానిర్దేశం చేసారు అని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు దిశ యాప్ అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నాయి అని ధర్మాన తెలిపారు.