ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారికి జల కల బోరు మంజూరు చేయడం జరిగిందని , జగనన్న కుల మత ప్రాంతాల కు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఇందుకు నిదర్శనం చంద్రబాబు సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు అందించడం హర్షణీయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. పాల సముద్రం మండలం కేంద్రంలోని సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జలకళ పథకం ద్వారా మంజూరు చేసిన పేర్ల నమోదు ను బహిరంగ ప్రసంగించారు.