ఆటోలో రూ. 30 వేలు విలువైన నిషేధిత గుట్కాను అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువుకు చెందిన ఆసీఫ్ తరలిస్తుండగా శనివారం అరెస్టు చేసినట్లు బి. కొత్తకోట ఎస్సై రామమోహన్ తెలిపారు. రంగసముద్రం రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో గుట్కా ప్యాకెట్లు ఆటోలో ఉన్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు వినియోగిస్తున్న ఆటోను జప్తు చేసినట్లు ఎస్సై వివరించారు.