అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన భావ్య తన భర్త నరేంద్ర (35) మూడు రోజులుగా కనిపించడం లేదని పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త దుకాణంలో ఉంటూ సాయంత్రం ఇంటికి వచ్చే వాడని, బుధవారం ఉదయం బయలుదేరి దుకాణానికి వెళ్లి భర్త తిరిగి ఇంటికి రాలేదని, అన్ని చోట్ల గాలించిన ఆచూకీ తెలియరాలేదని ఫిర్యాదు చేసింది.