పుత్తూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహా ప్రతిష్టను మంత్రి ఆర్. కె. రోజా ఆదివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవిని కళాశాలలో విగ్రహ ప్రతిష్టాపన ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు, విద్యా సంస్కారాలు అలవడతాయన్నారు. భవిష్యత్తులో ఇక్కడ విద్యార్థులు మంచి స్థాయిలో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.