అభివృద్ధి, సంక్షేమం బీజేపీ దగ్గర ఉండగా.. రాష్ట్రంలో కుటుంబ పార్టీల కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. పొత్తుల కోసం చంద్రబాబు త్యాగాలను గమనించాల్సిన పనిలేదన్నారు. అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమన్న సోము వీర్రాజు... 2024లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.