బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడింది. ఇది తుపానుగా మారి వాయువ్య దిశగా గంటకు 16KM వేగంతో కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 970KM దూరంలో కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం వరకు సాధారణ తుపానుగా ఉండి.. రేపు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa