ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను నిషేధించిన గూగుల్ ప్లే స్టోర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 10:15 PM

గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకొంది. స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ సదుపాయం ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే, ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని గూగుల్ భావిస్తోంది. అందుకే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను నిషేధిస్తోంది. ఈ నిషేధం మే 11 నుంచి అమలు కానుంది. 


ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు. ఇకపై యాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి కాల్ రికార్డింగ్ ఏపీఐ యాక్సెస్ పొందడం కుదరదని, అయితే శాంసంగ్, వివో, రెడ్ మీ తదితర పేరెన్నికగన్న కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్ లు ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com