అవుకు మండలంలో ఇస్త్రానాయక్ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ. రాబడిన సమాచారం మేరకు నాటుసారా బట్టిలపై దాడులు నిర్వహించి 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 60లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.