ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలో వైశాఖ నరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలలో ప్రారంభించారు. అందులో భాగంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య సోమవారం శేషవాహనంపై ఉత్సవమూర్తి జ్వాలా నరసింహస్వామిని వేదపండితులు ఊరేగించారు. మధ్యాహ్నం అభిషేకం, రాత్రి భేరి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.