కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల యందు గత రాత్రి నుండి కరెంట్ లేక నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆ పాఠశాల విద్యార్థినిలు, సిబ్బంది తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం కల్గడంతో ప్రిఫేర్ కావడానికి కాస్తా ఇబ్బందికరంగా ఉందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ట్రాన్స్ కో సిబ్బంది స్పందించి, కరెంట్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థినిలు కోరుతున్నారు.