జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్. ఎస్. రావత్, జలవనరులశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి. నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.