చంద్రబాబునాయుడు రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలపల్లిలో జరిగే జాతరలో చంద్రబాబు పాల్గొననున్నారు. 13న కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa