తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు , విజయవాడ నుండి ఎమ్మెల్యే గా గెలచి, తన మార్కు సేవలతో పేరు సంపాదించుకొని, చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రి పదవి పొందిన వ్యక్తి బోండా ఉమా. పార్టీకి రక్షకులుగా పని చేసే వారిలో ముందంజలో ఉంటూ, పార్టీని భలేపేతం చెయ్యడానికి కృషి చేసిన నాయకులు బోండా ఉమా. తాజాగా ఆయన కుమారుడు వివాహ సందర్భంగా , నారా చంద్రబాబుకి ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన బొండా సిద్ధార్థ్ - జశ్వంతి ల సంగీత్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.