ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 11:48 AM

ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్‌ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో నారాయణకు బెయిల్‌ మంజూరు చేశారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌ లో మంగళవారం అరెస్టు చేసి చిత్తూరుకు తరలించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి నారాయణను తరలించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. 


ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున లాయర్ లు జడ్జికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో జడ్జి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com