రామంతాపూర్ శ్రీనివాసపురంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 329 ఆరాధన మహోత్సవాలు బుధవారం జరుగుతాయని ఆలయ కమిటి అధ్యక్షుడు వెల్పుకొండ వెంకటేష్ చారి, ప్రధాన కార్యదర్శి నాగారం శ్రీనివాసాచారి, కోశాధికారి పులిమామిడి బాలకృష్ణచారి తెలిపారు. బుధవారం ఉదయం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో జరిగే ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి రేవంత్ రెడ్డి, మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్, కార్పొరేటర్లు కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి, ఎం. రజిత పరమేశ్వర్ రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోష్ణ్న, బేతి స్వప్న తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం సుప్రభాతం, స్వామి వారికి అభిషేకం, గణపతి పూజ, యజ్ఞ మహోత్సవం, ఆరాధన మహోత్సవం, తీర్థ, అన్న ప్రసాద వితరణ, ఊరేగింపు ఉంటాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విశ్వకర్మ సంఘం ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు.