ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసులో మైనర్ బాలుడికి మూడేళ్ల జైలు శిక్ష

Crime |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 01:08 PM


బాలుడిని హత్యచేసి బావిలో పడేసిన సంచలన కేసులో నిందితుడైన మరో బాలుడికి మూడేళ్ల జైలు శిక్ష పడిందని పోలీసులు తెలిపారు... మూసాపేట మండలం జానంపేటలో గతేడాది ఫిబ్రవరి 22న పుట్ట సంతోష్‌ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. అదే నెల 24న బాలుడు బావిలో శవమై తేలాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు తగిన ఆధారాలతో దర్యాప్తు చేశారు. చనిపోయిన బాలుడి సవతి తల్లి కొడుకైన 16 ఏళ్ల బాలుడే చంపాడని నిర్ధారణకు వచ్చి అరెస్టు చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జువేనైల్‌ కోర్టు న్యాయమూర్తి సాక్షాలను పరిశీలించి 16 ఏళ్ల నిందితుడే నేరస్థుడని తేల్చి మూడేళ్ల జైలుశిక్ష విధించినట్లు పోలీసులు చెప్పారు. నేరస్థుడు బాలుడు కావడంతో శిక్షను జువైనల్‌ హోంలోనే పూర్తి చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com