అసని తుఫాను నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జీఎంసీ లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. తుఫాను తో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 0863-2345103 నెంబర్ కు తెలియజేయవచ్చుని పేర్కొన్నారు. విభాగాల అధికారులoదరికీ సెలవులు రద్దు చేసినట్లు కమిషనర్ తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలన్నారు.