నిజాంపట్నం మండలంలో అసాని తుఫాన్ పరిస్థితులు, ఈదురుగాలులు, భారీ వర్షాలు వల్ల మండల పరిస్థితులు గురించి బాపట్ల ఆర్డివో జి. రవీందర్ బుధవారం తహసీల్దార్ జి. శ్రీనివాస్, విఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని తీరప్రాంతాలు దిండి, కొత్తపాలెం గ్రామాలను తహసీల్దార్, విఆర్వోలతో కలిసి సందర్శించారు. ప్రజల స్థితిగతులు గురించి ఆరా తీశారు. దిండి గ్రామం లో సముద్ర తీరాన్ని సందర్శించి అలలు ఉదృతిని పరిశీలించారు. మండలంలో ఉదయం నుండి భారీ వర్షాలు మొదలైనాయని, ఈదురుగాలులు వీస్తున్నాయని, కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని విఆర్వోలు తెలియజేశారు. తుఫాన్ సమయంలో ముందస్తుగా యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టడానికి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి స్థితి గతులు గ్రామం లోని విఆర్వోలు ఎప్పటికప్పుడు తహసీల్దార్ కి తద్వారా పై అధికారులకు, తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చెసిన తుఫాన్ సహాయచర్యలు కేంద్రానికి సమాచారం ఇవ్వాలని బాపట్ల ఆర్డివో రవీందర్ తెలియజేశారు. ఆర్డివో వెంట డీపీవో శంకరరావు, తహసీల్దార్ జి. శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.