ఈదురు గాలులు, వర్షం కారణంగా పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో రైతు హుస్సేన్ పీరకు చెందిన బొప్పాయి తోట నేలమట్టం కావడాన్ని ఉద్యానవన శాఖ అధికారిణి మిత్రవింద మాధురి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్సేన్ పీర అనే రైతు సర్వే నెంబర్ 223లో తనకున్న 1. 20 ఎకరములలో బొప్పాయి తోట సాగు చేశారని, అయితే సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు, కురిసిన వర్షానికి తోట మొత్తం నేల కూలిందని, దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు వెల్లడించారు. రెండు మూడు రోజులలో పూర్తి నివేదికను పంపుతామని, పంట నష్టపోయిన రైతు హుస్సేన్ పీరను ఆదుకొనేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఏఏ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.