భర్త, అత్త, మామ వేధింపులకు పాల్పడినట్లు మండల పరిధిలోని మాలపల్లి గ్రామానికి చెందిన కురువ పద్మ మాధవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజా కుళ్ళాయప్ప తెలిపిన వివరాల మేరకు. మాలపల్లి గ్రామానికి చెందిన కురువ పద్మను అత్త శివమ్మ, మామ ఈరన్న, భర్త వీరేష్ గత 10 సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, గత అయిదు రోజులు కింద అత్త, మామ, తన భర్త కట్టెతో మోకాళ్ల పై కొట్టి మూగ గాయాలు చేశారని ఫిర్యాదు చేసిందని తెలిపారు. కురువ పద్మ ఫిర్యాదు మేరకు అత్త, మామ, భర్త లపై కేసు నమోదు చేసి నట్లు ఎస్సై తెలిపారు.