పల్లెసీమల్లో అడుగిడగానే స్వాగతం పలికేవి చింతచెట్లే. దాదాపుగా కర్నూలు జిల్లా పరిధిలోని అనేక గ్రామాల్లో చింతచెట్లు అధికంగా దర్శనమిస్తాయి. ఈ చింతచెట్ల నుంచి లభించే చింతకాయలు, చింతపండు వంటి నిక్షేపాలను మనం ఏడాదంతా వినియోగిస్తూనే వుంటాం.
ఇందులో చింతపండు పాత్ర వంటల తయారీలో ప్రముఖంగా ఉన్నప్పటికీ చింతకాయలతో తయారీ చేసే పచ్చడిని కొన్ని సంవత్సరాల పాటు నిల్వ వుంచుకుని తినే అవకాశం వుంటుంది. మిగిలిన పచ్చళ్ల కంటే చింతకాయలతో తయారు చేసే పచ్చడి ఎక్కువకాలం నిల్వ వుండటంతో పాటు నోరు ఊరించేలా చక్కటి రుచిని కలిగిన విషయం అందరికి తెలిసిందే.
అయితే చింతచెట్టు నుంచి లభించే చింతచిగురుకు మాత్రం ప్రత్యేకమైన ఔషధగుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాదిలో కేవలం వసంతరుతువులో మాత్రమే లభ్యమయ్యే చింతచిగురును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరనున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మనం తీసుకునే ఆహారంలో చింతచిగురును వినియోగిస్తే అనారోగ్య చింతలు చెంతకు రావని చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో లభించే చింతచిగురును ప్రతిఒక్కరు ఆహారంగా తీసుకోవడం అరోగ్యానికి ఎంతో మంచింది.
అయితే పల్లెసీమల్లోనే అధికంగా లభించే చింతచిగురు పట్టణవాసులకు అందడం కొంత కష్టమే అయినప్పటికీ పల్లెల్లోకి వెళ్లి చింతచిగురు తెచ్చుకుని ఉపయోగించుకోవడం మన అరోగ్యానికి ఉపయోగపడుతోందన్న విషయాన్ని పట్టణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
చింతచిగురు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే.
చింత చిగురులో డైటరీ పైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్దమైన లాక్సేటీవ్ గా పనిచేసి జీర్ణవ్యవస్థను చక్కదిద్ది విరేచనం సులభంగా అయ్యేలా చేస్తోంది. దీంతో మలబద్దకం సమస్య తొలగిపోతోంది. పైల్స్ వున్న వారికి కూడా చింత చిగురు మంచి ఔషధకారిణిగా పనిచేస్తోంది.
ఫినాల్స్, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చింత చిగురు చెడు కొలెస్టాలను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్‌ఫెక్షన్ల పై పోరాడి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయట.
చింత చిగురుతో ఉడికించిన నీటిని నోటిలో వేసుకుని పుక్కిలిస్తే... గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉండటంతో నోటిలోని సమస్యలపై త్వరగా ఉపశమనం కలిగాయి.
వేడివేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు పూతలను చింత చిగురు తగ్గిస్తోంది. గుండె జబ్బులు రాకుండ చూస్తోంది. శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తోంది. రక్తాన్ని శుద్ది చేసే గుణాలు చింతచిగురులో ఉన్నాయి.
కడుపులో నులి పురుగులు సమస్యతో తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతోంది. జీర్దాశయ సంబంధిత సమస్యలను తొలగించడంలో చింత చిగురు బహు ప్రయోజకారిణిగా దోహదపడుతోంది.
చింత చిగురులో విటమిన్-సి, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ది లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తోంది. యాంటిసెప్టిక్ యాంటి వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. పలు రకాలు క్యాన్సర్‌లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. తరుచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగంగా ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తోంది. ఆల్కహాల్‌ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తోంది.
చింత చిగురును ఫేస్ట్‌లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. అర్ధరైటీస్ నమన్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తోంది.శరీరంలో వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్టిజెంట్‌లా పనిచేస్తోంది.
నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తోంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింతచి గురు తింటే ఉపశమనం కల్లుతోంది. ఇలా అనేక విధాలుగా చింతచిగురు మానవ అనారోగ్య సమన్యలపై ప్రభావం చూపి ఉత్తమ ఔషధకారిణిగా గుర్తింపు దక్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa