భారత్ లో కొత్తగా 2,827 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,230 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 0.60 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.72 శాతంగా ఉంది.