ఎన్నికలు రాబోతున్న తరుణంలో, ప్రజలకి చేరువ కావాలి అనే ఉద్దేశంతో , మళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అనే ఆశయాలతో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ చేపట్టింది. కొన్ని చోట్ల ఈ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ, ఎక్కువ చోట్ల మాత్రం ప్రజలు వచ్చిన ప్రజాప్రతినిధుల మీద తిరుగుబాటు బావుట చూపుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే, గడప గడపలోనూ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కర్నూలు జిల్లా హత్తిబెళగల్లో మహిళలు , స్థానికులు మంత్రి గుమ్మనూరు జయరాంని సమస్యలపై నిలదీయడం జరిగింది. నిన్నటి రోజున, నెల్లూరు లోను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా ఇలానే ప్రజలు తిరుగుబాటు చేసారు. కానీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం మా 151 సీట్లు ఈ సారి కూడా మావే అని అనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.