తమిళనాడులోని లో కాంచీపురానికి చెందిన కరుణాకరన్ (80), శివగామి (75) దంపతులు తమ కుమారుడికి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు. కరుణాకరన్ రిటైర్డ్ టీచర్ కాగా, శివగామి జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. వారి కుమారుడు హరికరన్ (48) గతేడాది మే 10న గుండెపోటుతో మృతిచెందాడు. ఆ తర్వాత తమ కుమారుడి జ్ఞాపకార్థం రూ.2.5 లక్షలు వెచ్చించి 5.3 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహం చొక్కా, ప్యాంటుకు హరికరన్ కు ఇష్టమైన రంగులు వేయించారు.
హరికరన్ తొలి వర్ధంతి సందర్భంగా ఈ నెల 9న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విగ్రహావిష్కరణ చేశారు. హరికరన్ ను తమ దేవుడిగా భావిస్తున్నామని, ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటి ముందు ప్రత్యేకంగా గదిని నిర్మించి అందులో తమ కొడుకు విగ్రహాన్ని ప్రతిష్టించారు.