విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లనగా పెళ్లి పీటలపైనే వధువు ప్రాణాలు కోల్పోయింది. నగరం పాలెంలో బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వధువు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.