అచ్చుతాపురం మండలంలోని సెజ్ కాలనీ మోటూరువాని పాలెం గ్రామంనుండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై రాష్ట్ర అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో వైయస్సార్సీపి,టిడిపి పార్టీకి చెందిన సుమారు 80మంది జనసేన పార్టీలో చేరినట్లు జనసేన నాయకులూ తెలియచేసారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ , జనసేన విధి విధానాలు నచ్చి చాల మంది ప్రజలు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన అధికారం వైపు అడుగులు వేస్తుంది అన్నారు. వైసీపీ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రజలకి వివరించి , ప్రభుత్వాన్ని ఎండగట్టి, రాబోయే రోజుల్లో సరిక్రొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ధీమా వ్యక్త పరిచారు.