స్టాక్ మార్కెట్ అంటే అంతా నసీబ్ అంటారు. కానీ కొన్ని కంపెనీలు దానికి భిన్నంగా ఉన్నాయి. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్(జీఎస్‌పీఎల్) స్టాక్ నేడు 4.5 శాతానికి పైగా పెరిగింది. తన షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవల్ రూ.264ను ఇది దాటేసింది. మార్కెట్లు నేడు బలహీనంగా ఉన్నప్పటికీ.. ఈ స్టాక్‌కు మంచి కొనుగోళ్ల ఆసక్తి కనబడుతోంది. నిఫ్టీ 500లో టాప్ గెయినర్లలో ఒకటిగా ఈ కంపెనీ స్టాక్ ఉంది. మునపటి స్వింగ్ హై రూ.292.40ను తాకిన తర్వాత ఈ స్టాక్ 13 శాతం కరెక్షన్‌కు గురైంది. ఆ తర్వాత ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ అయింది. రూ.250 అనేది ఈ స్టాక్‌కు బలమైన కొనుగోళ్ల స్థాయిగా ఉంది. టెక్నికల్ ఛార్ట్‌లో ఈ స్టాక్ బలమైన బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పాటు చేయడంతో.. ప్రస్తుతం ఈ స్టాక్ రోజువారీ గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది.
14 రోజుల డైలీ ఆర్ఎస్ఐ తన మునపటి స్వింగ్ హైను క్రాస్ చేయడంతో.. ఇది ఈ స్టాక్ పెరుగుదలను సూచిస్తోంది. ఏంఏసీడీ లైన్, సిగ్నల్ లైన్ కలుసుకుని, రాబోయే రోజుల్లో బుల్లిష్ క్రాస్‌ఓవర్‌ను చేరుకుంటుందనే సంకేతాలిస్తున్నాయి. ఆన్ బ్యాలెన్స్ వాల్యుమ్ పరంగా ఈ స్టాక్ బలంగా ఉంది. ఇది మునపటి స్వింగ్ హైకి దగ్గర్లో ట్రేడవుతోంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 10 శాతానికి పైగా ఈ స్టాక్ తగ్గింది. ఇదే సమయంలో బ్రాడర్ మార్కెట్లు, ప్రత్యర్థి కంపెనీలు కూడా అండర్ పర్‌ఫార్మ్ చేశాయి. అయితే అన్ని కీలకమైన మూవింగ్ యావరేజ్‌లకు ప్రస్తుతం కిందనే ట్రేడవుతోంది. మీడియం నుంచి లాంగ్ టర్మ్‌లో బేరిష్ సెంటిమెంట్‌ను ఇది సూచిస్తోంది. ఇదే సమయంలో ధరల యాక్షన్ మాత్రం ఈ ట్రెండ్‌కు రివర్స్‌గా ఉంది. బుల్లిష్ సిగ్నల్స్‌ను ఇది సూచిస్తోంది. రిస్క్ రివార్డు రేషియోకి అనుకూలంగానే ఉన్నప్పటికీ.. షార్ట్ టర్మ్‌లో మంచి రిటర్నులను పొందే అవకాశం కనిపిస్తోంది. రూ.275 స్థాయిలకు కనుక ఇది పెరిగితే.. అక్కడి నుంచి మరింత అప్‌ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్టాక్ తదుపరి కదలికల కోసం ట్రేడర్లు దీన్ని వాచ్‌లిస్టులో పెట్టుకుంటే మంచిది. ఇలాంటి మరింత సమాచారం కోసం దేశంలోనే నెంబర్ 1 ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ ‘దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్’ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.