విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. కొత్తపేట లంబాడి పేట లో స్థానికులు గంజాయి వారిపై సమాచారం ఇచ్చారంటూ 5 ద్విచక్ర వాహనాలు తగలబెట్టారు. నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతి రోజు లంబాడి పేట ప్రాంతంలో గంజాయి మత్తులో వీరంగం చేయడం ఆనవాయితీగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి టూ టౌన్ కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa